చూసినవారంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు
కమల్‌హాసన్ ‘నాయకుడు’(1987) సినిమాను తెలుగులో విడుదల చేసి, తొలి అడుగులోనే అభిరుచిని చాటుకున్నారు నిర్మాత రవికిశోర్. సింగీతం శ్రీనివాసరావు క్లాసిక్ ‘పుష్పకవిమానము’(1988) చిత్రాన్ని కూడా ఈయనే తెలుగు ప్రేక్షకులకు అందించారు.
కమల్‌హాసన్ ‘నాయకుడు’(1987) సినిమాను తెలుగులో విడుదల చేసి, తొలి అడుగులోనే అభిరుచిని చాటుకున్నారు నిర్మాత రవికిశోర్. సింగీతం శ్రీనివాసరావు క్లాసిక్ ‘పుష్పకవిమానము’(1988) చిత్రాన్ని కూడా ఈయనే తెలుగు ప్రేక్షకులకు అందించారు. నేరుగా రవికిశోర్ తీసిన సినిమాలు కూడా సామాన్యమైనవికావు. లేడీస్ టైలర్, మహర్షి, మావిచిగురు, ఎగిరేపావురమా, నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావ్, నువ్వే నువ్వే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు. ఆయన నిర్మాణం నుంచి రానున్న మరో విభిన్న చిత్రం ‘దీపావళి’. స్రవంతి రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం ‘కీడ’కు ఇది తెలుగు అనువాదం. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రానికి దర్శకుడు ఆర్ఏ వెంకట్. ఈ నెల 11న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా రవికిశోర్ విలేకరులతో ముచ్చటించారు.
తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే
నిర్మాతగా 36ఏండ్ల నా ప్రయాణాన్ని చూస్తే గర్వంగా ఉంటుంది. ఇప్పటివరకూ బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా చేయలేదు. ఇన్నాళ్ల వ్యవధిలో తక్కువ సినిమాలు చేయడానికీ కారణం అదే. ‘కీడ’ కథ నచ్చి నా అంతట నేను దర్శకుడు వెంకట్‌కి ఫోన్ చేశాను. తను వేరేవాళ్లతో కమిటయ్యానన్నాడు. అవకాశం ఉంటే చెప్పమన్నాను. అదృష్టం బావుండి చివరకు అది నా దగ్గరకే వచ్చింది. బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్ చేసి పంపమని అడిగా. తను పంపాడు. విని ఓకే చేశా. ఇక ఏ రోజూ అతని పనిలో జోక్యం చేసుకోలేదు. ప్రాణంపెట్టి కథ రాసుకున్నాడు. ప్రాణం పెట్టి తీశాడు. అవసరమైన డబ్బుని మాత్రం ఏర్పాటు చేశా. విడుదలకు ముందే వివిధ చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలందుకుంది.
బలగం చూశాక నమ్మకం కుదిరింది
మొదట తమిళంలోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ కరోనా తర్వాత మన ప్రేక్షకులు అన్ని భాషలనూ ఆదరిస్తారని అర్థమైంది. ముఖ్యంగా ‘బలగం’ సినిమాకు వచ్చిన స్పందన చూశాక, ‘దీపావళి’ని కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నమ్మకం కుదిరింది. ఇటీవలే ఈ సినిమా ప్రీమియర్ షో వేశాం. చూసిన వారంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రేపు థియేటర్లలో కూడా ఇలాంటి స్పందనే వస్తుందని నమ్మకంగా చెప్పగలను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

