ముంబయ్‌లో ఓదెల 2 హంగామా
నాగసాధువుగా తమన్నా భాటియా నటించిన సూపర్ నాచురల్ పాన్ ఇండియా థ్రిల్లర్ ‘ఓదెల 2’. ఓటీటీ హిట్ ‘ఓదెల రైల్వేస్టేషన్'కి ఇది సీక్వెల్. అశోక్‌తేజ దర్శకుడు. డి.మధు నిర్మాత. సంపత్ నంది దర్శకత్వ పర్వవేక్షణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది.
నాగసాధువుగా తమన్నా భాటియా నటించిన సూపర్ నాచురల్ పాన్ ఇండియా థ్రిల్లర్ ‘ఓదెల 2’. ఓటీటీ హిట్ ‘ఓదెల రైల్వేస్టేషన్’కి ఇది సీక్వెల్. అశోక్‌తేజ దర్శకుడు. డి.మధు నిర్మాత. సంపత్ నంది దర్శకత్వ పర్వవేక్షణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని ఈ నెల 8న ముంబయ్‌లో జరిగే ఓ ఈవెంట్లో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు. ‘ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో చేశాం. టీజర్‌ను కుంభమేళాలో విడుదల చేశాం. ట్రైలర్‌ని ముంబయ్‌లో విడుదల చేయనున్నాం. తెలుగుతోపాటు హిందీ ట్రైలర్‌ని కూడా అదే వేదికపై విడుదల చేస్తాం. సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్ ఉంటుంది’ అని మేకర్స్ తెలిపారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్.సింహా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో యువ, నాగమహేశ్, వంశీ, గగన్ విహారీ, సురేందర్‌రెడ్డి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్.ఎస్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: మధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్ వర్క్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

