బిగ్ బాస్ నుండి బయటకు వస్తే ఖరీదైన కారు కొనడం లేదంటే కొత్తింట్లోకి ప్రవేశించడం చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ లగ్జరీ కార్లు కొని వాటికి సంబంధించిన ఫొటోలు, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక శివజ్యోతి, గంగవ్వ వంటి వారు కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇప్పుడు యాంకర్ శ్యామల వంతు వచ్చింది. ఈ అమ్మడు కూడా బిగ్ బాస్‌లో సందడి చేసింది.
ఒకసారి బయటకు వచ్చేసిన మరో సారి రీఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ విజేతగా నిలవలేకపోయింది. అయితే ప్రస్తుతం యాంకర్‌గా పలు షోలతో బిజీగా ఉన్న యాంకర్ శ్యామల తాజాగా కొత్త ఇంట్లోకి మారింది. దీనికి సంబంధించిన గృహప్రవేశం వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయగా కొద్ది గంటల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నూతన ఇంట్లోకి మారిన శ్యామల దంపతులకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వేడుకకు ఆలీ, గీతా మాధురి వంటి ప్రముఖులు హాజరయ్యారు.
డూప్లెక్స్ హౌస్ మొత్తాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎన్ని రూమ్స్.. ఎలా డెకరేట్ చేయబోతున్నారనే విషయాన్ని గతంలో ఓ వీడియోలో వివరించింది శ్యామల. ఈ విల్లాలో విశాలంగా ఉండే రెండు హాల్స్, కిచెన్.. బెడ్ రూం.. దేవుడి గది.. శ్యామల మేకప్ రూం.. చిల్డ్రన్స్ కోసం స్పెషల్ ఎలివేషన్ రూం.. ప్లే గ్రౌండ్.. ఇంట్లోనే లిఫ్ట్.. స్టడీ అండ్ ఉయ్యాల కోసం స్పెషల్ రూం.. పార్టీలు కోసం స్పెషల్ స్పేస్ ఇలా ఫుల్ లగ్జరీగా నిర్మిస్తున్నట్టు చెప్పుకొచ్చింది