టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), పరశురాం (Parasuram) క్రేజీ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). మే 12న రిలీజైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద సక్సెస్ టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. రెండో రోజు కూడా ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అనే ఫార్ములాను అప్లై చేస్తూ తన హవా కొనసాగించింది.
రెండో రోజుల కలెక్షన్లకు సంబంధించిన అప్ డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తాజా అప్ డేట్ ప్రకారం నైజాంలో సర్కారు వారి పాట రెండు రోజుల్లో రూ.5.2 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. ఈ చిత్రం ప్రాంతాల వారిగా రాబట్టిన కలెక్షన్ల వివరాలిలా ఉన్నాయి.
ప్రాంతాల వారిగా కలెక్షన్ల వివరాలు..
నైజాం- రూ.5.2 కోట్లు
సీడెడ్-రూ.1.45 కోట్లు
యూఏ ఏరియా – రూ.1.65 కోట్లు
ఈస్ట్- రూ.1.08 కోట్లు
వెస్ట్- రూ.45 లక్షలు
గుంటూరు- రూ.51 లక్షలు
కృష్ణా- రూ.89 లక్షలు
నెల్లూరు- రూ.41 లక్షలు
ఏపీ&తెలంగాణలో 2 రోజుల షేర్-రూ.11.64 కోట్లు