Sridevi Shoban Babu | చిరంజీవి కూతురికి అగ్నిపరీక్ష.. ఆ సినిమా హిట్టు కొట్టేనా?
చిరంజీవి పెద్ద కూతురు ఆశలన్నీ ఆమె నర్మిస్తున్న కొత్త సినిమా శ్రీదేవి శోబన్ బాబు అనేదానిపైనే ఉన్నాయి. ఆమెకి ఈ సినిమా హిట్టు ఓ పరీక్ష లాంటిది. గోల్డ్ బాక్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ద్వారా భర్త సహాయంతో చిన్న చిన్న వెబ్ సిరీస్లతో పాటు చిన్న సినిమాలు నిర్మిస్తున్నది.
Srdevi Shoban Babu | సాధారణంగా హీరోల వారసులు కచ్చితంగా హీరోలే అవుతుంటారు. కానీ కూతుర్లు(chiranjeevi daughter) మాత్రం హీరోయిన్ అవ్వాలని రూల్ లేదు. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల కూతుర్లందరూ నటనకు దూరంగానే ఉన్నారు. కొందరు నిర్మాతలుగా.. మరికొందరు కాస్ట్యూమ్ డిజైనర్లుగా బిజీ అయిపోయారు. అందులో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉంది. ఇప్పటికే తండ్రి హీరోగా నటిస్తున్న ప్రతి సినిమాకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అంటూ ఒక నిర్మాణ సంస్థ మొదలుపెట్టి అందులో తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు సుష్మిత. ఇప్పటికే ఈ గోల్డెన్ బాక్స్ నుంచి షూట్ అవుట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ వచ్చింది.
తాజాగా సంతోష్ శోభన్ హీరోగా ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే సినిమా నిర్మించింది. ప్రశాంత్ కుమార్ దిమ్మల అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నమ్మి ఈ సినిమా నిర్మించింది మెగా డాటర్. తన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో శ్రీదేవి శోభన్ బాబుపై చాలా ఆశలు పెట్టుకుంది సుస్మిత. దానికి తోడు తండ్రి చిరంజీవి ఆశీస్సులు తనపై ఎప్పటికీ ఉంటాయని.. ఈ సినిమా కథ ఆయనకు బాగా నచ్చింది అని ప్రమోషన్స్ లో తెలిపింది సుష్మిత. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో దొరికిన ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 విడుదల కానుంది. మరోవైపు హీరో సంతోష్ శోభన్ కెరీర్ కు కూడా శ్రీదేవి శోభన్ బాబు సినిమా కీలకంగా మారింది.
ఎందుకంటే సంక్రాంతికి విడుదలైన కళ్యాణం కమనీయం సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో కూడా ప్రేక్షకులకు గుర్తులేదు. కెరీర్ లో ఇప్పటివరకు సరైన బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తూనే ఉన్నాడు ఈ హీరో. ఓటీటీలో రెండేళ్ల కింద విడుదలైన ఏక్ మినీ కథ మినహాయిస్తే.. హీరోగా సంతోష్ శోభన్ కు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మరోటి లేదు. ఆ తర్వాత మంచి హైప్ తో విడుదలైన నేర్లపాక గాంధీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా డిజాస్టర్ అయింది. అలాగే సంక్రాంతికి వచ్చిన యువీ క్రియేషన్స్ వారి కళ్యాణం కమనీయం అంచనాలు అందుకోలేదు. ఇలాంటి సమయంలో చిరంజీవి కూతురు నిర్మించిన మొదటి సినిమాలో హీరోగా నటించాడు సంతోష్ శోభన్. ఈ సినిమా ఆయనకు మాత్రమే కాకుండా సుస్మితకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. మరి మెగా డాటర్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ కుర్ర హీరో ఎంత వరకు నిలబెడతాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

