అత్యుత్తముడైన సామాన్యుడిగా కనిపిస్తా..
‘ఎన్నోఏండ్లుగా తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు విలువ కట్టలేను.
‘ఎన్నోఏండ్లుగా తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు విలువ కట్టలేను. ఈ ప్రేమకోసం ఎంతైనా కష్టపడాలనిపిస్తుంది. ఇతర భాషలకు చెందిన దర్శకులతో పనిచేయడం ఓ కొత్త అనుభవం. ఈ విషయంలో నాగార్జునసార్ నాకు ఆదర్శం. తెలుగు హీరో అయ్యుండి ఆయన మణిరత్నం, ఫాజిల్, మహేశ్‌భట్, ప్రియదర్శన్ తదితర దర్శకులతో పనిచేశారు. నేనూ ఆయన దారిలోనే వెళ్తూ, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ చేశా. ఇప్పుడు ‘సీన్’ చేశాను. ఇది నా కెరీర్లోనే విభిన్నమైన సినిమా. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న సామాన్యుడిగా ఇందులో కనిపిస్తా.
సామాన్యుడిగానే ఎన్నో సాధిస్తా. అందుకే ఈ సినిమాలో ఓ డైలాగ్ కూడా ఉంది. ‘ఐయామ్ ది బెస్ట్.. ఐ కెన్ డూ ఎనీథింగ్..’. ఆత్మ విశ్వాసం ఉంటే ఏమైనా సాధించొచ్చని నా పాత్ర చెబుతుంది. యువతరం ప్రేరణగా తీసుకోవాల్సిన పాత్ర ఇది. నజ్రియాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇందులో మాయగా అద్భుతంగా నటించారు తను. ఇది యాక్షన్ సినిమా మాత్రమే కాదు, అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మీ ప్రేమ, ఆశీస్సులు మాకు కావాలి.’ అని హీరో సూర్య అన్నారు. ఆయన హీరోగా రూపొందిన యాక్షన్, కామెడీ డ్రామా ‘సీన్’. నజ్రియా నజీమ్ కథానాయిక.
జితు మాధవన్ దర్శకుడు. 2డీ ఎంటర్టైన్మెంట్, జగరం స్టూడియోస్ పతాకాలపై సూర్య, జ్యోతిక, జయశ్రీదామోదరన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్నది. తెలుగు వెర్షన్‌ని ఎన్వీఆర్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల నజ్రియా ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందంతోపాటు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, ప్రముఖ నిర్మాత సుప్రియ యార్లగడ్డ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

