Karuppu Box Office Collection | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. వారాంతంలోనే కాకుండా వర్కింగ్ డే అయిన సోమవారం (నాలుగో రోజు) కూడా ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ట్రెండీగా, చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈ జోరు చూస్తుంటే సూర్య సినీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన (Career Highest Grosser) చిత్రంగా ‘కరుప్పు’ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పాత రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతున్న ఈ చిత్రం త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.