Geetha Arts | దక్షిణాది అగ్ర నిర్మాణ సంస్థలలో గీతా ఆర్ట్స్ ఒకటి. అల్లు అరవింద్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఐదు దశాబ్ధాలుగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌గా కొనసాగుతుంది. కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ విజయ యాత్రను కొనసాగిస్తుంది. దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా పలు సినిమాలు నిర్మించి సక్సెస్ అయింది. టాలీవుడ్లో సక్సెస్ రేటు అత్యధికంగా ఉన్న నిర్మాణ సంస్థలలో ఇది కూడా ఒకటి. అయితే గతకొంత కాలంగా ఈ సంస్థ నుంచి పెద్ద సినిమాలేవి రాలేవు. కాగా త్వరలోనే ఈ సంస్థలో భారీ భారీ సినిమాలు తెరకెక్కబోతున్నాయి. అందులో సూర్యతో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం.
తమిళ నటుడు సూర్యకు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో.. తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంది. తమిళ సినిమాలకు సమానంగా తెలుగులోనూ ఆయన సినిమాలకు కలెక్షన్లు వస్తుంటాయి. కాగా అల్లు అరవింద్.. సరైనోడు సమయంలోనే బోయపాటితో మరో సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చేశాడు. ఇక సూర్యతో కూడా ఓ భారీ సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ కుదరలేదు. కాగా ఇన్నేళ్లకు అది కుదిరినట్లు తెలుస్తుంది. బోయపాటి దర్శకత్వంలో సూర్య ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. వచ్చే నెల అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్‌గా అప్డేట్ వచ్చే చాన్స్ ఉంది.