Suriya | ‘రోలెక్స్’.. కమల్‌హాసన్ ‘విక్రమ్’ సినిమా చూసినవాళ్లకుఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. డ్రగ్స్ దందాను నడిపే లీడర్ గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేశారు సూర్య (Suriya). ఈ పాత్రలో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో చాలా కీలకం. అలాగే ఖైదీ లో కార్తీ (Karthi) చేసిన డిల్లీ పాత్రతో కూడా రోలెక్స్ (Rolex)కి లింక్ వుంది. లోకేష్ కనకరాజ్ రోలెక్స్ సినిమా కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు.
ఐతే ఈలోగా స్టార్ దర్శకుడు శంకర్, సూర్య, కార్తీని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు సూర్య. ఇటివలే శంకర్ ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ ని సూర్యకి వినిపించారు. సూర్య, కార్తీని దృష్టిలో పెట్టుకొని ఈ కథని రాసుకున్నారు. దాదాపు ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు పూర్తయిన తరువాత సూర్య, కార్తి సినిమా వుంటుందని టాక్.