జాతరను తలపించే సినిమా
నాకు తెలుగు రాకపోయినా.. తెలుగువా రి మనసు బాగా తెలు సు. ‘వీరభద్రుడు’ ని జంగా అద్భుతమైన ప్రయాణం. తెలుగు కంటెంట్‌ని రాకేందుమౌళి అద్భుతంగా రాశారు. దర్శకుడు ఆర్జే బాలాజీ మల్టీ టాలెంటెడ్ పర్సన్.
నాకు తెలుగు రాకపోయినా.. తెలుగువారి మనసు బాగా తెలుసు. ‘వీరభద్రుడు’ ని జంగా అద్భుతమైన ప్రయాణం. తెలుగు కంటెంట్‌ని రాకేందుమౌళి అద్భుతంగా రాశారు. దర్శకుడు ఆర్జే బాలాజీ మల్టీ టాలెంటెడ్ పర్సన్. తను నిజాయితీగా ఈ సినిమా తీశాడు. తను కథ చెబుతుంటే వీరభద్రుడు పూనినట్టు అనిపించింది. నిజంగా కూడా తను దేవుడ్ని బాగా నమ్ముతాడు. ఈ స్క్రిప్ట్‌లో అది కనిపిస్తుంది.
ఫస్ట్‌హాఫ్ ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా, సెకండాఫ్ మాస్ మాసాలా ఎలిమెంట్స్‌తో జాతరని మరిపించేలా సినిమా ఉంటుంది. త్రిషతో పాటు గ్రేట్ ఆర్టిస్టులు ఇందులో నటించారు. గొప్ప టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఈ నెల 14న వస్తున్నాం. మీ ప్రేమ కావాలి’ అని హీరో సూర్య అన్నారు. ఆయన హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ వీరభద్రుడు.
త్రిష కథానాయిక. ఆర్జే బాలాజీ దర్శకుడు. ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడారు. అతిధిగా విచ్చేసిన హీరో కార్తి మాట్లాడుతూ ‘ట్రైలర్ చూస్తుంటే ‘గజనీ’ సూర్యని చూస్తున్నట్టుంది. ఇది మాస్ మసాలా సినిమానే కాదు, ఫ్యామిలీ సినిమా కూడా. కొన్ని సీన్లు చూశాను. అవి అన్నయ్య మాత్రమే చేయగలరు. ఎంత బరువైన పాత్రనైనా ఆయన మోస్తాడు. ఇది థియేటర్లోనే చూడాల్సిన సినిమా’ అన్నారు. ఇంకా డైరెక్టర్ ఆర్జే బాలాజీ, నిర్మాత సుప్రియ యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

