Suriya 42 | సూర్య 42 రెగ్యులర్ షూటింగ్ షురూ
మాస్ డైరెక్టర్ సిరుతై శివ (Siruthai Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 42 (Suriya 42) సినిమా రీసెంట్గా చెన్నైలో గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు చెన్నైలో మొదలైంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) అభిమానులకు గుడ్ న్యూస్ అందిస్తూ..కొత్త సినిమా షూటింగ్ షురూ చేశాడు. మాస్ డైరెక్టర్ సిరుతై శివ (Siruthai Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 42 (Suriya 42) సినిమా రీసెంట్గా చెన్నైలో గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు చెన్నైలో మొదలైంది. తాజా అప్డేట్ ప్రకారం చెన్నైలో 10 రోజుల పాటు చిత్రీకరణ జరుగనుంది. అనంతరం వచ్చే నెలలో గోవా షెడ్యూల్ మొదలు కానుంది.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనున్నట్టు వార్తలు వస్తుండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఈ ఏడాది ఈటీ సినిమాతో మంచి హిట్టందుకున్నాడు సూర్య. దీంతోపాటు కమల్ హాసన్ లీడ్ రోల్లో నటించిన విక్రమ్‌లో రోలెక్స్ పాత్రలో సూర్య అదిరిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టాడు. మరోవైపు మాధవన్ టైటిల్ రోల్ పోషించిన రాకెట్రీ..ది నంబియార్ ఎఫెక్ట్‌లో అతిథి పాత్రలో మెరిశాడు.
We are excited to announce our Prestigious Mega Project #ProductionNo25 Starring #Suriya sir Shoot Started Today.#Suriya42 @Suriya_offl @directorsiva @StudioGreen2 @UV_Creations #Vamsi #Pramod @kegvraja @ThisIsDSP @vetrivisuals #Milan @SupremeSundar_ #AdiNarayana @madhankarky pic.twitter.com/xY7dkFHzhX
— Studio Green (@StudioGreen2) August 24, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

