Suriya 42 | సూర్య అభిమానులకు గుడ్‌న్యూస్.. Suriya 42 ఫస్ట్ లుక్, ప్రోమో అప్డేట్
సూర్య (Suriya) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి సూర్య 42 (Suriya 42). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42లో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఓ వైపు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తూనే.. మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంటాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి సూర్య 42 (Suriya 42). పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42లో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రోమోను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న అప్డేట్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. మరి మేకర్స్ దీనిపై అధికారికంగా డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్య ఈ సినిమాతో మరింత స్టార్డమ్ సంపాదించడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి వెట్రి పలనిస్వామి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. సూర్య 42 ప్రాజెక్ట్ 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే సూర్య 42 నుంచి విడుదలైన లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సూర్య ఈ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించనట్వంటి పాత్రలో మెరువబోతున్నట్టు ఇప్పటికే రిలీజైన స్టిల్‌తో తెలిసిపోతుంది
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే సూర్యకు అదిరిపోయే ఆల్బమ్స్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నాడు. సూర్య మరోవైపు బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ నటిస్తోన్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో అతిథి పాత్రలో నటిస్తున్నాడు . అదే విధంగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.
Read Also :
Oscars 2023 | ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేదా..? అయితే ఈ ఛానళ్లలో ఆస్కార్స్ ఈవెంట్‌ను వీక్షించండి..!
Jr NTR | హాలీవుడ్ స్టార్‌తో జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్‌లో స్టిల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

