Sunny Leone Re-entry | తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న సన్నీలియోన్
ఢి, దేనికైనా రెడి, దూసుకెళ్తా వంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు విష్ణు. దూసుకెళ్తా తర్వాత మంచు విష్ణు ఇప్పటివరకు సోలో హిట్‌ను సాధించలేకపోయాడు.
Sunny Leone Re-entry with Manchu Vishnu | ఢి, దేనికైనా రెడి, దూసుకెళ్తా వంటి చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు విష్ణు. దూసుకెళ్తా తర్వాత మంచు విష్ణు ఇప్పటివరకు సోలో హిట్‌ను సాధించలేకపోయాడు. ఓకే జోనర్లో సినిమాలు చేయడంతో ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టి ఈయన సినిమాలను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపడంలేదు. లేటెస్ట్గా ఈయన మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు.ఈ క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ ని సోషల్ మీడియాలో మంచు విష్ణు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాజ్‌పుత్ పాయిల్ హీరోయిన్గా నటిస్తుంది.
తాజాగా ఈ చిత్రంలోకి బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ జాయిన్ అయింది.ఈ చిత్రంలో రేణుక పాత్రలో నటిస్తున్నట్లు సన్నీలియెన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈచిత్రం తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈరోజు సన్నీలియోన్ ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంది. గతంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘కరెంట్ తీగ’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసారి మంచు విష్ణుతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో సన్నీ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలో నటించనుందట. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత,నిర్మాత కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. అనూప్ రుబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

