షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది బాస్’ ‘నెవర్ డైస్’ ఉపశీర్షిక. ఈశ్వర్‌బాబు ధూళిపూడి దర్శకుడు. బొమ్మకు మురళి నిర్మాత. ఈ చిత్ర టైటిల్ లోగోను నటుడు సునీల్ విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ బాబాగా మారితే ఎలా ఉంటుందనే ఊహజనిత కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. సమాజంలో పలు రుగ్మతలను ప్రశ్నిస్తూ సినిమా సాగుతుంది. టైటిల్ పాత్రలో షకలకశంకర్ నటన ఆకట్టుకుంటుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. సోహైల్, డెబోరాఫెల్, సన, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం-కూర్పు: హిమాన్షు.