టాలెంటెడ్ యాక్టర్ సునీల్ (Sunil) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం భువన విజయమ్ (Bhuvana Vijayam). క్రైం కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యలమంద చరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. తెల్ల లుంగీ, థిక్ బ్లూ షర్ట్‌లో ఉన్న సునీల్ ఛైర్‌పై సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా.. పక్కనే పృథ్విరాజ్ కంప్లీట్ వైట్ డ్రెస్‌లో కనిపిస్తున్నాడు.
మరోవైపు వెన్నెల కిశోర్ తన స్టైల్లో కొంచెం సీరియస్ యాంగిల్లో కనిపిస్తున్నాడు. వివిధ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన లుక్స్‌తో సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై కొంత హింట్ ఇచ్చినా.. ఇంతకీ ఎలాంటి స్టోరీతో వినోదాన్ని అందించబోతున్నాడన్నది మాత్రం సస్పెన్స్ నెలకొంది. మరి దీనిపై రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్ పృథ్వి, ధన్ రాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్కే తెరకెక్కిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తున్న జైలర్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు సునీల్.
మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్‌లో మంగళం శ్రీనుగా మరోసారి అలరించబోతున్నాడు. మరోవైపు తమిళ సినిమాలు మార్క్ ఆంటోనీ, జపాన్, మావీరన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటితోపాటు మిస్టర్ కింగ్‌లో కూడా నటిస్తున్నాడు.
Here’s the First Look Poster of Crime Comedy Thriller @bhuvanavijayam_ Movie 🎥 @suniltollywood @vennelakishore @harshachemudu @DhanrajOffl #YalamandaCharan @vemusri1972 @teju9666 @CineDigital_ pic.twitter.com/IA9AuaoDi8
— BA Raju's Team (@baraju_SuperHit) February 26, 2023
Read Also :
SSMB 28 | మహేశ్‌బాబుతో వన్స్‌మోర్.. ఎస్ఎస్ఎంబీ 28లో టాలెంటెడ్ యాక్టర్..!
Mahesh babu | సూపర్ యంగ్ లుక్‌లో మహేశ్ బాబు.. యాడ్ వీడియో వైరల్
Anikha Surendran | ఈ సారి కొంచెం హాట్‌గా.. అనిఖా సురేంద్రన్ ప్రమోషన్స్ స్టిల్స్ వైరల్