అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. సోమవారం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
‘అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే-రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే రోమాంచకం’ అంటూ మెలోడియస్ ట్యూన్‌తో ఈ గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. వాసుకి వైభవ్ మ్యూజిక్, విజువల్స్ ఈ గ్లింప్స్‌లో ప్రధానాకర్షణగా నిలిచాయి. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలబోసిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: వాసుకి వైభవ్, రచన-దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి.