తెలుగింటి ఆడపడుచు సుమలత ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్‌ని వివాహం చేసుకుని కన్నడ ఇంటి కోడలైన విషయం తెలిసిందే. 1991లో వీరి పెళ్లయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అంబరీష్–సుమలత హ్యాపీ కపుల్. భర్త మరణం తర్వాత సుమలత పైకి ధైర్యంగా కనబడుతున్నప్పటికీ లోలోపల ఆయన్ను ఎంతగా మిస్సవుతున్నారో ఆమె మాటలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న సుమలత తాజాగా తన 58వ బర్త్ డే వేడుకలని ఘనంగా జరుపుకుంది. ఈ బర్త్ డే వేడుకకి కన్నడ నటుడు ఉపేంద్ర, కేజీఎఫ్ చిత్రంతో ఫుల్ ఫేమస్ అయిన యష్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుమలత బర్త్ డేకి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల మరో సీనియర్ నటి సుహాసిని బర్త్ డే వేడుక జరగగా, ఈ కార్య్రమంలో కమల్ హాసన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సందడి చేసిన విషయం తెలిసిందే. సుమలత నటిగానే కాదు హోస్ట్ గాను తెలుగుతెరపై అద్భుతాలు సృష్టించారు.