‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ గత మూడు నాలుగు రోజులకు ముందు కూడా ఈ పేరు ఎవరికి తెలియదు.. ఈ పేరే ఎవరికి తెలియదు అంటే ఇక ఈ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసే అవకాశమే లేదు. సడెన్‌గా ఈ సినిమా మీదే అందరి దృష్టి పడింది. గత వారం రోజులుగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. దీనికి కారణం మారుతి నగర్ సుబ్రమణ్యం నక్క తొక నాలుగైదు సార్లు తొక్కాడనే చెప్పాలి.
లేకపోతే ఏంటండీ.. ఇది.. ఓ చిన్న సినిమా అందునా మొదటిసారి రావురమేష్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాకు పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పణలో రూపొందటం, ఆమెకు సినిమా నచ్చి మరీ ఈటీమ్‌లో జాయిన్ అయ్యారట. ఇక ఓకే ఆమె సినిమాను తన భుజాన వేసుకుని తీసుకెళ్తున్నారు.. సుబ్రమణ్యం లక్ ఇంతటి ఆగిపోలేదు సుమా.. ఈ రోజు జరగనున్న ప్రీరిలీజ్ వేడుకకు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావడం కదా.. అసలైన సన్సేషన్..
గత కొంత కాలంగా అల్లు అర్జున్‌పై నడుస్తున్నవివాదాల కారణంగా ఆయన ఎటువంటి ఫంక్షన్‌కు హాజరుకావడం లేదు. చాలా కాలం విరామం తరువాత ఆ అదృష్ణం సుబ్రమణ్యంకు దక్కింది. ఇంతేనా దర్శకుడు సుకుమార్ కూడా ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా రానున్నాడు. ఇక ఈ ఇద్దరు ఒకే స్టేజీపైనే చూసి చాలా కాలం అయింది. నిజంగా ఇది సన్పేషన్ కాంబో అని చెప్పాలి.
ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప ది రూల్ గురించి ఈ వేదికపై ఏమైనా అప్డే్ట్ వస్తుందా.. లేక పోతే బన్నీ తన మీద రూమర్స్‌కు సమాధానం చెబుతాడా? ఇలా వంద ప్రశ్నలు అల్లు అర్జున్ అభిమానులనే కాదు సగటు సినీ ప్రేక్షకుడు మదిలో మెదులుతున్నాయి.. రావు రమేష్ లీడ్ పాత్రలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ బజ్ అంతా మారుతి నగర్ సుబ్రమణ్యం ఓపెనింగ్స్‌కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో లేదో చూడాలి.. ఏది ఏమైనా నీకు ఎక్కడో సుడి వుంది సుబ్రమణ్యం.. ఆల్ దబెస్ట్
Also Read
Polygraph Test: ఆర్జీ కార్ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష !
Spurthi Reddy | ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించిన జలమండలి మేనేజర్ స్పూర్తిరెడ్డి..!
MS Dhoni | లోకల్ ధాబాలో ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న ధోనీ.. పిక్స్ వైరల్