OG | ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీతో సుజిత్.. ట్రెండింగ్‌లో స్టిల్
OG | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ (OG). సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా మూడో షెడ్యూల్ విజయవంతంగా కంప్లీట్ చేసింది సుజిత్ టీం.
OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ (OG). సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఓజీలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఓజీ నేటితో 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మూడో షెడ్యూల్ విజయవంతంగా కంప్లీట్ చేసింది సుజిత్ టీం.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ (EmraanHashmi) విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఓజీ సెట్స్‌లో విలన్‌తో సుజిత్ డిస్కస్ చేస్తున్న స్టిల్ ఒకటి నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. మూడో షెడ్యూల్లో మాస్, ఎనర్జిటిక్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసినట్టు సమాచారం. ఓజీలో చెన్నై భామ శ్రియా రెడ్డి (Sriya Reddy) కీలక పాత్రలో నటిస్తోంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. సుజిత్ టీం ఇటీవలే ఓజీ ముంబై, పూణే షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసింది.పవన్ కల్యాణ్ మరోవైపు బ్రో చిత్రంలో నటిస్తున్నాడు. జులై 28న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) కూడా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. మరోవైపు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమల్లులో నటిస్తున్నాడు పవన్ కల్యాణ్.
#Sujeeth with @EmraanHashmi on the sets of #OG.
Emraan is playing the villain opposite @PawanKalyan.@DVVMovies#FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/pjoebXdowq
— BA Raju’s Team (@baraju_SuperHit) June 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ. 26 కోట్ల సైబర్ మోసంలో ఈడీ సోదాలు
స్కౌట్ అండ్ గైడ్ది నిస్వార్థ సేవ
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

