koragajja | కర్ణాటకలో గ్రామీణ సంస్కృతి, ఆచారాల నేపథ్యంలో వచ్చిన కాంతార పలు భాషల్లో రిలీజై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కొరగజ్జ’(korakajja ) సినిమాతో మరో స్టోరీ కన్నడతోపాటు మలయాళం, హిందీ, తెలుగు, తమిళ్, తులు భాషల్లో రాబోతుంది. సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ సాఫల్య నిర్మిస్తున్నారు.
కాగా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించేలా కొరగజ్జ 3D టెక్నాలజీతో రాబోతుందన్న వార్త మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ మూవీని ఇటీవలే విడుదల చేయాలనుకున్నారు కానీ.. కొరగజ్జ సినిమాను ఓ ఇంటర్నేషనల్ టీం ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్లోకి మారిస్తే ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని, మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుందని సలహా ఇచ్చిందట. ఈ మేరకు కొరగజ్జ చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్లోకి మార్చాలని ఫిక్సయ్యారని సమాచారం. అంతేకాదు త్రీడీ ఫార్మాట్ కోసం సుమారు 40 మంది నిపుణులతో కూడిన స్పెషల్ టీం పనిచేస్తుందట.
విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచేందుకు క్లైమాక్స్‌ను నీటి అడుగున చిత్రీకరించారు. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్‌కు చెందిన విస్మయ స్టూడియోలో ఈ సీన్ షూట్ చేయడం విశేషం. ఈ సీన్ కోసం ప్రత్యేకంగా నీటి అడుగున సెట్ నిర్మించగా.. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పిళ్లై నాలుగు కెమెరాలు వినియోగించారు. డాక్టర్ రాజ్ కుమార్ తర్వాత నటి శృతి అండర్ వాటర్ సీక్వెన్స్‌లో స్వయంగా నటించింది. ఈ సీక్వెన్స్ కోసం శృతి 15 రోజులు శిక్షణ కూడా తీసుకుంది. సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి హార్పెస్ ధరించి నీటిలోకి దూకి, కెమెరా ముందే పైకి తేలడమనేది మూవీలో స్పెషల్ అట్రాక్షన్లలో ఒకటిగా నిలుస్తుందట. శృతి ఆక్సిజన్ సాయం లేకుండా 22 సెకన్లపాటు అండర్‌వాటర్ సీక్వెన్స్‌లో పాల్గొందట. ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే నిర్మాత రూ.12 కోట్లు పెట్టారు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ సాఫల్య నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ కబీర్ బేడీ కింగ్ ఆఫ్ ఉడయవరగా కనిపించబోతుండగా.. భవ్య, శృతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. లీడ్ క్యారెక్టర్ కొరగజ్జ థీమ్‌ను ప్రతిబింబించేలా సరికొత్త గెటప్‌లో కనిపిస్తూ.. కొరగజ్జ మరో కాంతార కాబోతుందని హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీలోని అన్ని పాటలను డైరెక్టర్ కమ్ రైటర్ సుధీర్ అత్తావర్ రాయడం విశేషం. కర్ణాటక తులునాడులో పూజింపబడే దైవం ‘కొరగజ్జ’కథతో ఈ సినిమా రాబోతుంది.



Mega Family | మెగా ఫ్యామిలీతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్పెషల్ షో.. థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేసిన చిరు!
RGV | ‘ధురంధర్’పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు… ఇది కొత్త దర్శకులకి బెంచ్‌మార్క్
Kangana Ranaut | ఆదిత్య ధర్ ఒక సూపర్ ఫిలిం మేకర్.. ‘ధురంధర్’ దర్శకుడిపై కంగనా రనౌత్ ప్రశంసలు