Sudheer Babu | సుధీర్ బాబు పాన్ ఇండియా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్
Sudheer Babu | హిట్, ఫెయిల్యూర్ టాక్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సుధీర్ బాబు (Sudheer Babu). జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్షన్లో నటించిన హరోంహర త్వరలోనే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. కాగా ఇప్పుడు సుధీర్ బాబు కొత్త సినిమా వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
Sudheer Babu | హిట్, ఫెయిల్యూర్ టాక్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సుధీర్ బాబు (Sudheer Babu). జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్షన్లో నటించిన హరోంహర ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. త్వరలోనే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. కాగా ఇప్పుడు సుధీర్ బాబు కొత్త సినిమా వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఈ యాక్టర్ తాజాగా పాన్ ఇండియా సినిమాకు సంతకం చేశాడు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్ కల్యాణ్ (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన స్టోరీలైన్‌తో కొత్త స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. రుస్తుం, టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్, పారి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించిన ప్రేర్నా అరోరా ఓ లీడింగ్ స్టూడియోతో కలిసి తెరకెక్కిస్తుండటం అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
తాజా టాక్ ప్రకారం పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తుండగా.. త్వరలోనే ప్రకటన కూడా ఉండబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ ఇన్ సైడ్ టాక్. 2025 మార్చిలో శివరాత్రి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ స్క్రిప్ట్, జోనర్ కోసం నేను ఏడాదికిపైగా అన్వేషణలో ఉన్నాను. ఈ విషయాన్ని మా ప్రేక్షకులతో పంచుకోవడానికి సంతోషిస్తున్నా. ప్రేరణ అరోరా, మా అంకితభావంతో కూడిన బృందం ప్రపంచ స్థాయి సినిమా అనుభవాన్ని మీకు అందించేందుకు సిద్దంగా ఉన్నామని తన ఎక్జయిట్‌మెంట్‌ను తెలియజేశాడు సుధీర్ బాబు.
Read Also :
Double iSmart | ఊరమాస్‌గా రామ్ డబుల్ ఇస్మార్ట్ STEPPAMAAR లిరికల్ వీడియో సాంగ్
Thalapathy 69 | విజయ్ దళపతి 69 హీరోయిన్ ఫైనల్.. డైరెక్టర్‌పై క్లారిటీ..!
Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మూవీ!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

