Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మూవీ!
గత ఏడాది ‘దసరా’ చిత్రంతో హీరో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Srikanth Odela | గత ఏడాది ‘దసరా’ చిత్రంతో హీరో నాని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. కొద్ది మాసాల క్రితం విడుదల చేసిన ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్ అందరిలో ఆసక్తినిరేకెత్తించింది. ఈ సినిమా కూడా ‘దసరా’ తరహాలోనే సింగరేణి నేపథ్య కథాంశమని ప్రచారం జరిగింది.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో పాతబస్తీ నేపథ్యంలో కథ నడుస్తుందని, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బలమైన భావోద్వేగాలతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ సిద్ధం చేశారని అంటున్నారు. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తికాగానే శ్రీకాంత్ ఓదెల చిత్రం పట్టాలెక్కనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

