Double iSmart | ఊరమాస్‌గా రామ్ డబుల్ ఇస్మార్ట్ STEPPAMAAR లిరికల్ వీడియో సాంగ్
Double iSmart | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఈ మూవీ నుంచి ఫస్ సింగిల్ STEPPAMAAR ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Double iSmart | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ సింగిల్ STEPPAMAAR ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. మేకర్స్ చెప్పినట్టుగానే మాస్ సాంగ్ ది ఇయర్‌గా ఈ పాట నిలవనుందని తాజా విజువల్స్‌తో క్లారిటీ ఇచ్చేస్తుంది పూరీ టీం.
మాస్ మ్యూజిక్ జాతర ఉండబోతుంది.. వేచి ఉండండి.. అంటూ డబుల్ ఇస్మార్ట్ గెటప్‌లో స్టైలిష్‌గా నడుచుకుంటూ వెళ్తున్న రామ్ లుక్‌తో ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇస్మార్ట్ శంకర్‌కు స్పీకర్ దద్దరిల్లిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు తాజా సాంగ్‌తో అర్థమైపోతుంది.
డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ధిమాక్కిరికిరి డబుల్ ఇస్మార్ట్ అంటూ ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.
ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్.. అంటూ పూరీ టీం ఇప్పటికే శక్తిమంతమైన త్రిశూలంతో డిజైన్ చేసిన పోస్టర్లో రామ్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని, భుజంపై గన్ పెట్టుకొని ధమ్కీ ఇస్తూ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాడు.
MAMAAA! YOUR “MENTAL MASS” IS BACK AS #STEPPAMAAR!!!
Gunnjjiiii Koditheeee…………..
Speakerlu Pagilipovallleeeee!!https://t.co/9rwVB7yYEj-USTAAD #DoubleISMART SHANKAR pic.twitter.com/JsZSlHQ8OJ
— RAm POthineni (@ramsayz) July 1, 2024
Read Also :
Thalapathy 69 | విజయ్ దళపతి 69 హీరోయిన్ ఫైనల్.. డైరెక్టర్‌పై క్లారిటీ..!
Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మూవీ!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

