Kajal Aggarwal | స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మళ్లీ కెరీర్లో బిజీ అవుతున్నది. లాక్డౌన్లో పెండ్లి చేసుకుని వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించిన ఈ నాయిక తిరిగి నట ప్రయాణంపై దృష్టి సారించింది. మంచు విష్ణు సోదరిగా నటించిన ‘మోసగాళ్లు’, తమిళ చిత్రం ‘హే సినామిక’ తర్వాత కాజల్ తెరపై కనిపించలేదు. ఆమె అంతకుముందే అంగీకరించిన ‘భారతీయుడు 2’ సినిమా సెట్స్‌లో ఇటీవల అడుగుపెట్టింది కాజల్. ప్రస్తుతం ఆమెకు మరిన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
అజిత్ హీరోగా నటిస్తున్న 62వ సినిమాలో నాయికగా కాజల్ ఎంపికైనట్టు తాజా సమాచారం. ఇందులో ఆమె టీచర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించనున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉండేది. అయితే స్క్రిప్ట్ విషయంలో వచ్చిన బేధాభిప్రాయలతో అజిత్ దర్శకుడిని మార్చారట. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ను మగిజ్ తిరుమేని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. కాజల్ ఖాతాలో తమిళంలో ‘కరుంగాపియమ్’, ‘గోస్టీ’, హిందీలో ‘ఉమా’ అనే చిత్రాలున్నాయి.