Pawan Directors | భీమ్లానాయక్‌తో స్టార్ డైరెక్టర్లు..ఫ్యాన్స్ లో జోష్
భీమ్లా నాయక్ (Bheemla Nayak) షూటింగ్ ఫైనల్ డే లొకేషన్ స్టిల్స్ పవన్ కల్యాణ్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. తాజాగా లొకేషన్లో పవన్ ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో దిగిన ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన కొత్త చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak) షూటింగ్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. చివరి రోజు షూటింగ్‌కు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే బయటకు వచ్చింది. షూటింగ్ ఫైనల్ డే లొకేషన్ స్టిల్స్ పవన్ కల్యాణ్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. తాజాగా లొకేషన్లో పవన్ ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో దిగిన ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు దర్శకులెవరో అర్థమయే ఉంటుంది..వాళ్లే క్రిష్ (Krish Jagarlamudi), హరీష్ శంకర్ (Harish Shankar). చివరి రోజు షూటింగ్ టైంలో లొకేషన్‌ను ఈ ఇద్దరు డైరెక్టర్లు విజిట్ చేశారు.
డైరెక్టర్ క్రిష్, తన అప్ కమింగ్ మూవీ హీరో పవన్‌తో కలిసి దిగిన స్టిల్ ట్విటర్ లో షేర్ చేశాడు. పోలీస్ గెటప్‌లో ఉన్న పవన్ తో ఓ వైపు హరీష్ శంకర్, మరోవైపు క్రిష్ కనిపిస్తున్నారు. ఈ ఫొటోకు పవన్ రాబోయే సినిమాలు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ టైటిల్స్ ను క్యాప్షన్ గా పెట్టాడు క్రిష్. ఈ ట్యాగ్‌లైన్‌కు ఇంప్రెస్ అయిన హరీష్ శంకర్ గుడ్ వన్ బ్రో..అందుకే నీ రైటింగ్స్ అంటే నాకిష్టం..అంటూ ప్రశంసలు కురిపిస్తూ రీట్వీట్ చేశాడు.
'భవదీయుడు' 'హరి హర'
భీమ్లా నాయక్!@harish2you pic.twitter.com/UdOfwwIy6r
— Krish Jagarlamudi (@DirKrish) February 16, 2022
సాగర్ చంద్ర డైరెక్షన్ లో వస్తున్న భీమ్లా నాయక్ ఫిబ్రరి 25న విడుదల కానుంది. విడుదలకు మరో 9 రోజులే ఉండటంతో పవన్ ప్రి రిలీజ్ ఈవెంట్, సాంగ్స్, ఇతర అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Naga Vamshi | శర్వానంద్ చిత్రానికి భీమ్లానాయక్ నిర్మాత మాస్టర్ స్ట్రోక్..!
Boyapati Sreenu | బోయపాటి కొత్త చిత్రంలో రవితేజ హీరోయిన్..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

