యోధుల సమరగర్జన

ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. గురువారం ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమా చిత్రీకరణకు సంబంధించిన కొన్ని ఘట్టాల్ని చూపించారు. ఉత్కంఠను పంచే పోరాటఘట్టాలతో మేకింగ్ వీడియా ఆద్యంతం అందరిని ఆకట్టుకుంటోంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో అలియాభట్, ఒలీవియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. దాదాపు 450కోట్ల వ్యయంతో నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

