పెళ్లెందుకు బాబోయ్.. సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న యువ హీరో

ఒక వయసు వచ్చిందంటే చాలు.. కచ్చితంగా అందరు అడిగే ఒకే మాట పెళ్లి ఎప్పుడు..? దానికి సమాధానం చెప్పే వరకు ఎవ్వరూ వదిలిపెట్టరు. అదే సెలబ్రెటీల విషయంలో అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి వీళ్ల పెళ్లిళ్లపై పుకార్లు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరో కమ్ డైరెక్టర్ దగ్గర పెళ్లి గురించి ప్రస్తావన రావడంతో ఓపెన్ అయ్యాడు. సోలో బ్రతుకే సో బెటర్.. జీవితంలో పెళ్లి చేసుకోను అంటూ కుండబద్దలు కొట్టాడు. ఆయనెవరో కాదు అవసరాల శ్రీనివాస్.
నూటొక్క జిల్లాల అందగాడు సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అవసరాల. దిల్ రాజు, క్రిష్ నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.ఈ సినిమాకు కథ కూడా ఆయనే అందించాడు. అతని స్నేహితుడు దాచకుండా విద్యాసాగర్ దర్శకుడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి టాపిక్ వచ్చింది. దానికి ఏ మాత్రం మొహమాట పడకుండా సమాధానం చెప్పాడు అవసరాల శ్రీనివాస్. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అంటే.. జీవితంలో పెళ్లి చేసుకోను.. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సమాధానమిచ్చాడు. దానికి తన పర్సనల్ కారణాలు తనకు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు అవసరాల శ్రీనివాస్. ఒంటరిగా ఉండటంలోనే తనకు సంతోషంగా ఉందన్నాడు ఈయన.
జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని కూడా క్లారిటీ ఇచ్చాడు అవసరాల శ్రీనివాస్.
అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవసరాల.. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీకి వచ్చాడు. అష్టా చమ్మా సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన.. నటుడిగా, కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారి తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆయన తెరకెక్కించిన రెండో సినిమా జో అచ్యుతానంద కూడా బాగానే ఆడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడిన ఈయన ఎవరు ? నేపథ్యమేంటి ?
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన దర్శనం మొగులయ్య వాడే వాద్య పరికరం ఏంటో తెలుసా?
పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే గిఫ్ట్.. ఆర్జీవీ చెంప పగులగొట్టిన ఆషురెడ్డి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

