Sridevi soda centre| ‘శ్రీదేవి సోడా సెంటర్’ 4 డేస్ కలెక్షన్స్..!
సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandhi) జంటగా కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi soda centre). ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.

సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandhi) జంటగా కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi soda centre). ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కులాంతర ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించలేదు. దాంతో కలెక్షన్స్ కూడా అంతే దారుణంగా ఉన్నాయి. ఏపీలో మూడు షోలు, కరోనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కూడా తొలిరోజు మంచి వసూళ్లనే సాధించింది శ్రీదేవి సోడా సెంటర్. కానీ రెండో రోజు నుంచి మాత్రం దారుణంగా పడిపోయాయి వసూళ్లు.
ఈ చిత్రం 4 డేస్ ఏరియా వైజ్ వసూళ్లు వచ్చాయి. ఈ కలెక్షన్స్ చూస్తుంటే సుధీర్ బాబుకు మరో ఫ్లాప్ తప్పేలా లేదు. వర్షాలు కూడా ఈ సినిమాకు ప్రతికూలంగానే ఉన్నాయి. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు కరుణ కుమార్ చేసిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు కూడా చాలా కారణాలతో తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
ఏరియాల వారిగా కలెక్షన్స్..
నైజాం: 1.22 కోట్లు
సీడెడ్: 0.57 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.43 కోట్లు
ఈస్ట్: 0.32 కోట్లు
వెస్ట్: 0.17 కోట్లు
గుంటూరు: 0.35 కోట్లు
కృష్ణా: 0.19 కోట్లు
నెల్లూరు: 0.10 కోట్లు
ఏపీ + తెలంగాణ: 3.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.26 కోట్లు
వరల్డ్ వైడ్: 3.61 కోట్లు

‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాకు రూ.7.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 8 కోట్లకు పైగానే షేర్ వసూలు చేయాలి. 4 రోజుల్లో ఈ సినిమా రూ.3.61 కోట్ల షేర్ వసూలు చేసింది. మరో 4.5 కోట్లు షేర్ వసూలు చేస్తే కానీ శ్రీదేవి సోడా సెంటర్ హిట్ లిస్టులోకి రాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుధీర్ బాబు అంత దూరం ఈ సినిమాను తీసుకెళ్తాడా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

