ఓటీటీలోకి వస్తున్న శ్రీదేవి సోడా సెంటర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

sridevi soda center in ott | ఒకప్పుడు కొత్త సినిమా టీవీలో రావాలంటే కనీసం విడుదలైన ఆరు నెలలు అయినా కావాల్సిందే. ఆ తర్వాతనే టీవీలో టెలికాస్ట్ అయ్యేవి. ఇక పెద్ద హీరో సినిమా అయితే దాదాపు ఏడాది సమయం పట్టేది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఒక సినిమా ఎంత బ్లాక్‌బస్టర్ అయినా సరే.. నెల నుంచి రెండు నెలల గ్యాప్‌లోనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా కూడా నెలలోపే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో టెలికాస్ట్ అయింది. ఇప్పుడు సాయి పల్లవి, నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా ఓటీటీలో నెలలోపే వచ్చేసింది. అక్టోబర్ 22 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఇదే బాటలో ఓటీటీలో వచ్చేందుకు శ్రీదేవి సోడా సెంటర్ కూడా సిద్ధమైంది.
యువ హీరో సుధీర్ బాబు, బస్‌స్టాప్ ఫేమ్ ఆనంది జంటగా నటించిన శ్రీ దేవి సోడా సెంటర్ సినిమా ఆగస్టు 27న థియేటర్లలో విడుదలైంది. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీంతో విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ సినిమా విడుదలైన సమయం సరిగ్గా లేదు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన సమయంలో ఈ సినిమా వచ్చింది. కానీ కరోనా భయంతో ఆడియన్స్ థియేటర్లకు వెళ్లేందుకు సుముఖత చూపలేదు. దీంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమా జీ 5 యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శ్రీదేవి సోడా సెంటర్ ఫైనల్ కలెక్షన్స్.. సుధీర్ బాబుకు మరో ఫ్లాప్ తప్పలేదు..!
శ్రీదేవి సోడా సెంటర్ ఆనందికి పెళ్లయిందా?
Sridevi Soda Centre | ‘శ్రీదేవి సోడా సెంటర్’ లో మహేష్ బాబుకు నచ్చిన సీన్లు ఇవే..!
Sudheer Babu | ప్రభాస్ తో వారం రోజులుంటే మీ ఫిట్నెస్ పోయినట్టే: సుధీర్ బాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

