Sridevi sobhan babu | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీదేవి శోభన్‌బాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sridevi sobhan babu Movie On OTT | యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ మాత్రం కాలేకపోతున్నాడు. కలిసి రాకో, అదృష్టం లేకో తెలీదు గానీ మారుతి, మేర్లపాక గాంధి వంటి సక్సెస్ ఫుల్ దర్శకులతో సినిమాలు చేసిన ఫలితం లేకుండా పోయింది.
Sridevi sobhan babu Movie On OTT | యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ మాత్రం కాలేకపోతున్నాడు. కలిసి రాకో, అదృష్టం లేకో తెలీదు గానీ మారుతి, మేర్లపాక గాంధి వంటి సక్సెస్ ఫుల్ దర్శకులతో సినిమాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీదేవి శోభన్ బాబు సినిమా కూడా సంతోష్‌ను గట్టెక్కించలేకపోయింది. మొదటి నుంచి ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. కానీ మెగాడాటర్ సుష్మిక ప్రొడక్షన్లో వస్తున్న సినిమా కావడం.. దానికి తోడు ట్రైలర్ కాస్త ఆసక్తి పెంచడం వంటివి సినిమాపై కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. తీరా రిలీజయ్యాక డివైడ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ కలెక్షన్లను రాబట్టింది.
సంతోష్ కెరీర్లో మరో ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటన వచ్చింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఇక మార్చి 30 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రశాంత్ దిమ్మెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్‌కు జోడీగా తమిళ నటి గౌరీ కిషన్ హీరోయిన్గా నటించింది.
Sreedevi Shobhan Babu la entertainment flick March 30 nundi! 🍿🎬#SrideviShobanBabuOnHotstar premieres only on #DisneyPlusHotstar.@santoshsoban @Gourayy @sushkonidela #VishnuLaggishetty @dimmalaprasanth @GoldBoxEnt @NagaBabuOffl @SyedKamran @Saranyapotla pic.twitter.com/pdXiCWOgPj
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) March 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

