శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’ రామ్ అబ్బరాజు దర్శకుడు. రాజేష్ దండా నిర్మిస్తున్నారు. మే 18న విడుదలకానుంది. రెబా మోనికా జాన్ కథానాయిక. ఈ చిత్రంలోని ఫస్ట్సింగిల్ ‘వాట్ టు డూ’ పాటని గురువారం విడుదల చేశారు. గోపీసుందర్ సంగీతాన్నందించిన ఈ పాటకు శ్రీమణి రచించారు. ‘కుటుంబ అనుబంధాలు, ప్రేమ, వినోదం కలబోతగా రూపొందిస్తున్న చిత్రమిది. ప్రేమ ప్రయాణంలోని అనుభూతులకు అద్దం పడుతుంది. శ్రీవిష్ణు పాత్ర చిత్రణ గత చిత్రాలకు భిన్నంగా ఉంటూ మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాంరెడ్డి, కథ: భాను భోగవరపు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.