Alluri Teaser | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేయడంలో శ్రీ విష్ణూ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇటీవలే ఈయన నటించిన ‘భళా తందనాన’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం శ్రీవిష్ణు ‘అల్లూరి’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
‘ఎక్కడి దొంగలక్కడే గప్‌చుప్.. పోలీస్ బయల్దేరాడురా’ అంటూ టీజర్ స్టార్ట్ అయింది. ‘విప్లవానికి నాంది చైతన్యం.. చైతన్యానికి పునాది నిజాయితి.. నిజాయితికి మారుపేరు అల్లూరి’ అంటూ వచ్చే డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్‌తో నిండిఉంది. విష్ణు మొదటి సారిగా పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. పోలీస్‌గా డిఫరెంట్ వేరియేషన్‌ను చూపించాడు. డైలాగ్ డెలివరీ, పోలీస్‌గా విష్ణు హూందాతనం ఆకట్టుకుంటుంది. చివర్లో ‘అల్లూరి సీతారామరాజు సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్’ అంటూ శ్రీవిష్ణు డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు.