Squid Game S2 | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ మళ్లీ వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి 2021లో సీజన్ 1 రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. సిరీస్‌లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది. కాగా.. ప్రస్తుతం స్క్విడ్ గేమ్ సీజన్ 2 రానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. స్క్విడ్ గేమ్ ఫస్ట్ సీజన్ గెలిచిన అనంతరం అందులో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి ప్లేయర్ 456 (గి-హన్) కనిపెట్టాలని చూస్తాడు. ఈ క్రమంలోనే అతడికి జరిగిన సంఘటనలు ఏంటి. గి-హన్ మళ్లీ స్క్విడ్ గేమ్ ఎందుకు ఆడడానికి వెళ్లాడు అనేది తెలియాలంటే సీజన్ 2 వచ్చేవరకు ఆగాల్సిందే.