స్వీయ దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా నటించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలుగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం థాంక్స్ మీట్‌ను నిర్వహించారు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నది. థియేటర్లలో ప్రేక్షకుల మధ్య సినిమా చూశాను. అందరూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. చివరి ఇరవై నిమిషాలు ఉత్కంఠగా ఫీలవుతున్నారు.
కథలో మలుపులు ఆసక్తిని పెంచుతున్నాయి. కంప్లీట్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటున్నది. ఈ విజయంలో భాగమైన అందరికి కృతజ్ఞతలు’ అన్నారు. ‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం. కొత్త కంటెంట్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ సినిమానే ఉదాహరణ. ఆద్యంతం అనూహ్య మలుపులతో థ్రిల్‌ను కలిగిస్తున్నది’ అని రుక్సర్ థిల్లాన్ చెప్పింది.