సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘మండాడి’. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకుడు. వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మత్స్యకారుల నేపథ్యంలో సాగే కథ ఇది. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో సాట్టపులిగా సుహాస్ రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమాను తీశామని, యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, నిర్మాత: ఎల్రెడ్ కుమార్, దర్శకత్వం: మదిమారన్ పుగళేంది.