Mandaadi | కోలీవుడ్ నటుడు సూరి (Soori) హీరోగా, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ (Suhas) విలన్ పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం ‘మండాడి’ (Mandaadi). సముద్రం నేపథ్యంలో రాబోతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను ‘సెల్ఫీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మతిమారన్ పుగళేంది (Mathimaran Pugazhendhi) ఈ చిత్రానికి కథ అందించి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ టీజర్ చూస్తుంటే.. తమిళనాడులోని తీర ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ బోట్ రేస్ (Sailboat Racing) పోటీల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సముద్రం నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఇది రూపొందుతోంది. ఇందులో సూరి సరసన మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా, తెలుగు నటుడు సుహాస్‌తో పాటు ప్రముఖ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంప్రెస్సివ్‌గా ఉంది. ఈ సినిమా కోసం హీరో సూరితో పాటు నటుడు సుహాస్ ఎలాంటి బాడీ డబుల్స్ లేకుండా సముద్రంలో రిస్కీ యాక్షన్ సన్నివేశాలు, బోట్ రేస్ సీక్వెన్స్‌లలో చాలా కష్టపడి నటించినట్లు తెలుస్తుంది.