ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో వచ్చిన బాహుబలి ప్రాంఛైజీ గ్లోబల్ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. బాహుబలి 2 (Baahubali 2) తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా. ప్రభాస్, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ, అనుష్క కాంబినేషన్లో వచ్చిన ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బాహుబలి సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చేయడానికి అప్పట్లో రెడీగా ఉన్న యాక్టర్లు చాలా మందే ఉన్నారు.
అయితే ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించే ఛాన్స్ వచ్చినా..నో చెప్పిన యాక్టర్ ఒకరున్నారు. ఈ న్యూస్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ క్రేజీ యాక్టర్ ఎవరనే కదా మీ డౌటు. లాక్ డౌన్ టైంలో వేలాది మందికి నేనున్నానంటూ అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood),. బాహుబలి 2లో కీలక పాత్ర కోసం జక్కన్న సోనూసూద్‌ను సంప్రదించాడట. కానీ సోనూసూద్ మాత్రం నో చెప్పాడట. దీనిక్కారణమేంటనుకుంటున్నారా..? డేట్స్ సర్దుబాటు కాకపోవడమే.
రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం చెప్పాడు సోనూసూద్. సెకండ్ పార్టు కోసం రాజమౌళి తనను మల్టీపుల్ వర్కింగ్ డేట్స్ (పలు పని దినాలు) అడిగారని, అయితే ఆయన అడిగినట్టుగా డేట్స్ కుదరకపోవడంతోనే సినిమాను తిరస్కరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు సోనూసూద్. అరుంధతి లాంటి భారీ ప్రాజెక్టులో వదల బొమ్మాళీ..వదల అంటూ భయపెట్టించిన ఈ యాక్టర్‌కు ఇంతకీ జక్కన్న ఏం రోల్ ఆఫర్ చేసి ఉంటాడో అని తెగ చర్చించుకోవడం షురూ చేశారు సినీ జనాలు.
Read Also : Prithviraj Sukumaran | సలార్ స్క్రిప్ట్ అద్బుతం..తెలుగులో ఇంట్రెస్టింగ్ ఆఫర్లొస్తున్నాయి : పృథ్విరాజ్