Ajay Devgn | బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar 2). విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ థాకుర్ కథానాయికగా నటించబోతుంది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న(Maryada Ramanna) సినిమాను హిందీలో సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar) అని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాకు సన్ ఆఫ్ సర్దార్ 2 అంటూ సీక్వెల్‌ను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా విడుదల తేదీతో పాటు టీజర్‌ను పంచుకుంది. ఈ సినిమాను జూలై 25న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.