Son of India | సన్ ఆఫ్ ఇండియాతో పాటు రేపు అన్ని సినిమాలు వస్తున్నాయా..?
Son of India | చిన్న సినిమాలు విడుదల చేసుకోవడానికి మిగిలి ఉన్న ఒకే ఒక్క చివరి డేట్ ఫిబ్రవరి 18. ఎందుకంటే ఆ తర్వాత వారం నుంచి పెద్ద సినిమాలు వరసగా క్యూ కడుతున్నాయి. వారానికి కనీసం ఒక్క సినిమా విడుదలయ్యేలా మరో మూడు నెలల వరకు షెడ్యూల్ గట్టిగా ఫిక్స్ అయిపోయింది. అందుకే ఫిబ్రవరి 18న చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. అన్ని సినిమాలు వస్తున్నట్లు కూడా చాలా మందికి తెలియదు. ప్రేక్షకులు అయితే ఈ వారం వచ్చే సినిమాలపై పెద్దగా ఫోకస్ కూడా చేయలేదు. వచ్చే సినిమాల్లో కేవలం ఒక్క దాని గురించి మాత్రమే చాలా మందికి తెలిసి ఉంటుంది. అదే మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా.
డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఈ సినిమాను ముందు నుంచి అనుకున్న టైమ్‌కే విడుదల చేస్తున్నారు. ఒక్క ఈ సినిమా మాత్రమే కాస్త ఎక్కువ థియేటర్స్‌లో విడుదల కానుంది. మరోవైపు ఇదే రోజు మరో మూడు నాలుగు సినిమాలు కూడా వస్తున్నాయి. నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు లగడపాటి విక్రమ్ సహిదేవ్ ను హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా వర్జిన్ స్టోరీ. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 18నే విడుదల కానుంది. మరోవైపు మొన్న పుష్పలో విలన్ గా నటించి మెప్పించిన కన్నడ నటుడు ధనుంజయ్ హీరోగా చేసిన సినిమా బడవ రాస్కెల్. ఈ సినిమాను తెలుగులో ఫిబ్రవరి 18నే విడుదల చేస్తున్నారు. ఈ మూడు సినిమాలతో పాటు నీకు నాకు పెళ్లంట అనే సినిమా కూడా ఈ వారమే వస్తుంది. ఈ 4 సినిమాలలో అందరికీ మోహన్ బాబు సినిమాపైనే ఫోకస్ ఉంది. మరి వీటిలో ఎవరు ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.
Read More :
AHA: మరో సీనియర్ హీరో ఆహా కోసం హోస్ట్‌గా మారబోతున్నాడు…!”
Bheemla Nayak | భీమ్లా నాయకా మజాకా..నాన్ థియాట్రికల్ రైట్స్ ఎంత పలికాయంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

