Chiranjeevi | ఆ విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు : చిరంజీవి
Chiranjeevi | 24 కార్మిక సంఘాలు వేతనాలను 30 శాతం మేర పెంచాలని.. ఫెడరేషన్ ప్రతినిధులు ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు సానుకూలంగా జరుగకపోవడంతో నిరసనగా బంద్ ప్రకటించారు.
Chiranjeevi | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేసి బంద్ కొనసాగిస్తున్నాయని తెలిసిందే. వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30 శాతం మేర పెంచాలని.. ఫెడరేషన్ ప్రతినిధులు ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు సానుకూలంగా జరుగకపోవడంతో నిరసనగా బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కార్మికులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కమిషనర్ ఆఫీసుకు కూడా వెళ్లారు. మరోవైపు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై నిర్మాతలు చిరంజీవితో సమావేశమై చర్చలు కూడా జరిపారు.
ఈ వ్యవహారంలో తాజాగా ఫిలిం ఫెడరేషన్ కార్మికులు చిరంజీవిని కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. అయితే సోమవారం వరకు ఈ వేతనాల పెంపు సమస్య తీరకపోతే నా సినిమాకు సోమవారం నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇస్తామని చిరంజీవి హామీ ఇచ్చినట్టు వార్తలు ఊపందుకున్నాయి.
ఈ వార్తలపై తాజాగా చిరంజీవి ఎక్స్ ద్వారా స్పందించాడు. కార్మికుల వేతనాల పెంపు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య అని. ఈ విషయంలో ఏకపక్షంగా ఎవరూ నిర్ణయం తీసుకోలేరన్నాడు చిరంజీవి. 30 శాతం వేతనాల పెంపునకు తాను అంగీకరించానని.. షూటింగ్ ప్రారంభిస్తానని దుష్ప్రచారం చేస్తున్నారు. ఫెడరేషన్‌కు చెందిన ఎవరినీ నేను కలవలేదు. నాపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానన్నారు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అత్యున్నత సంస్థ ఫిల్మ్ ఛాంబర్. ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే సమిష్టిగా సంబంధిత సభ్యులందరితో చర్చలు జరిపి వారి కోసం న్యాయమైన పరిష్కారాన్ని కనుగొంటుంది. అప్పటి వరకు నిరాధారమైన తప్పుడు వాదనలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి ప్రేరేపతి వాదలన్నింటిని ఖండిస్తున్నా. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు చిరంజీవి.
It has come to my attention that some individuals claiming to be the members of the Film Federation have gone to media falsely claiming that I have met them and given an assurance that their demands regarding 30% wage hike etc., shall be met and that I will be starting shooting…
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2025
Read Also :
K Ramp | కిరణ్ అబ్బవరం ‘కే రాంప్’ నుంచి ‘ఓనం’ పాట విడుదల
Bishnoi Gang | సల్మాన్‌తో కలిసి ఎవరైనా పనిచేస్తే.. వారిని చంపేస్తాం : బిష్ణోయ్ గ్యాంగ్
Mass Jathara | రవితేజ ‘మాస్ జాతర’ టీజర్ వచ్చేది అప్పుడే.!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

