సంపూర్ణేష్‌బాబు, సంజోష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకుడు. చంద్ర చంగలా నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అన్నదమ్ములిద్దరూ పెళ్లి కొడుకు గెటప్స్‌లో ఉన్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ‘అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ హాస్యప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
చక్కటి వినోదంతో పాటు ఎమోషన్స్ ఉంటాయి. త్వరలో ఫస్ట్‌సింగిల్‌ను విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రాచీ బంసాల్, ఆరతిగుప్తా, బాబా భాస్కర్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కెమెరా: జాన్ సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, మాంక్ ఫిలిమ్స్.