ఉల్లాసంగా ఉత్సాహంగా (Ullasamga Utsahamga) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది ఒమన్ సుందరి స్నేహాఉల్లాల్ (Sneha Ullal). ఆ తర్వాత కరెంట్, సింహా లాంటి హిట్ చిత్రాలతోపాటు తెలుగులో పలు సినిమాలు చేసింది. ఈ బ్యూటీ తెలుగు సినిమాలో కనిపించక ఏడేళ్లకు పైగానే అవుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇక్కడి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమైంది స్నేహాఉల్లాల్.
ఈ టాలీవుడ్ (Tollywood) భామను అందరూ జూనియర్ ఐశ్వర్యారాయ్ అని కూడా పిలుస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్నేహాఉల్లాల్ Eight సినిమాతో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. సప్తగిరి మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించనుంది. స్నేహాఉల్లాల్ ఫస్ట్ లుక్ను మేకర్స్. బ్లాక్ డ్రెస్ లో సీరియస్ లుక్ లో కనిపిస్తోంది స్నేహాఉల్లాల్.
వివిధ భాషల్లో థ్రిల్లర్ జోనర్ లో రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ (Rizwan Entertainment) పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్నేహాఉల్లాల్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి