Sneha Reddy | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కుటుంబానికి సంబంధించిన అందమైన క్షణాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ప్రత్యేకమైన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్నేహారెడ్డి తన తాజా పోస్ట్‌కు ఎంతో ఎమోషనల్‌గా ఉండే క్యాప్షన్‌ను జత చేశారు. “నా హృదయాన్ని నింపే ఆ చిన్నారి ప్రాణాలు.. నిజమైన ‘ఇల్లు’ అనే భావనను కలిగించే ఆ చిన్నారి పాదాలు..” అంటూ ఆమె చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ ఫోటోషూట్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ ఎంతో క్యూట్‌గా కనిపించారు. తమ పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ, వాటితో ఎంతో ప్రేమగా గడుపుతున్న పిల్లల ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పిల్లల అమాయకత్వంతో పాటు పెట్స్‌తో వారి అనుబంధం కూడా ఫొటోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు స్నేహారెడ్డి కూడా తన పెట్‌తో కలిసి సోలో ఫొటోలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఆమె లుక్, ఫొటోషూట్ స్టైల్‌కు కూడా నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఉపాసన కామినేని కొణిదెలతో పాటు పలువురు ప్రముఖ ప్రొఫైల్స్ ఈ పోస్ట్‌పై హార్ట్ ఎమోజీలతో స్పందించారు.ఈ ఫ్యామిలీ ఫోటోషూట్‌లో అల్లు అర్జున్ కనిపించకపోవడం మాత్రం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో కామెంట్ సెక్షన్లో “Where is AA?”, “భాయ్ లేడేంటి మేడమ్?” అంటూ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘రాకా’ (RAAKA) షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్లే ఈ ఫోటోషూట్‌లో కనిపించలేదని అభిమానులు భావిస్తున్నారు. సినిమా షూటింగ్ కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అయాన్‌ను ఉద్దేశించి అభిమానులు చేసిన కొన్ని సరదా కామెంట్స్ ఇప్పుడు ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయి. “మీ నాన్న హైదరాబాద్‌లో లేరు కదా.. గేమ్స్ ఆడుకుంటానని చెప్పి డాడీ ఫోన్ తీసుకో. రాకా సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ ఏమైనా ఉంటే లీక్ చేయి!” అంటూ కొందరు అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు “వదినగారూ.. అన్నయ్యను ఎలాగైనా రాకా అప్డేట్ ఇవ్వమని చెప్పండి” అంటూ స్నేహారెడ్డిని కోరుతున్నారు. దీంతో ఈ పోస్ట్ కామెంట్ సెక్షన్లో అభిమానుల సందడి మామూలుగా లేదు.