కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్’.శ్రీని దర్శకుడు. సందేశ్ నాగరాజ్ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 19న కన్నడంలో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయబోతున్నారు. ‘పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. శివరాజ్‌కుమార్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారు.
గ్యాంగ్‌స్టర్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్ర బృందం పేర్కొంది. అనుపమ్‌ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహ, కథ, దర్శకత్వం: శ్రీని.