‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలో నటిస్తున్న చిత్రం ‘సెయాన్’. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శివకార్తికేయన్ పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు.
మాస్, ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాలు కలబోసిన సినిమా ఇదని, గ్రామీణ నేపథ్య కథాంశంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్నందిస్తున్నారు.