Sivakarthikeyan | ట్విట్టర్ నుంచి బ్రేక్.. శివకార్తికేయన్ డెసిషన్‌కు కారణమేంటో..?
Sivakarthikeyan | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శివకార్తికేయన్ (Sivakarthikeyan) షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇంతకీ అదేంటనుకుంటున్నారా..?
Sivakarthikeyan | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటనుకుంటున్నారా..? తాను ట్విట్టర్ (Twitter)నుంచి విరామం తీసుకుంటున్నట్టు ప్రకటించాడు శివకార్తికేయన్ . నా ప్రియమైన సోదరసోదరీమణులారా.. కొంతకాలంపాటు ట్విట్టర్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నా. త్వరలోనే తిరిగొస్తా. అన్ని సినిమాల అప్డేట్స్ ను నా టీం అందిస్తుంది.. అని ట్వీట్ చేశాడు.
ఇంతకీ శివకార్తికేయన్ ఇలా సడెన్ డెసిషన్ తీసుకోవడానికి కారణమేంటని చర్చ నడుస్తుండగా.. రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో చేయబోతున్న కొత్త సినిమాపై ఫోకస్ పెట్టేందుకే శివకార్తికేయన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. శివకార్తికేయన్ ప్రస్తుతం మడొన్నె అశ్విన్ దర్శకత్వంలో మావీరన్ చిత్రంలో నటిస్తున్నాడు. కామిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.
మరోవైపు ఆర్ రవికుమార్ సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న అయలాన్‌లో కూడా నటిస్తున్నాడు. దీపావళి కానుకగా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన అయలాన్ లుక్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. గతేడాది డాన్, ప్రిన్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శివకార్తికేయన్. వీటిలో డాన్ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రిన్స్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
శివకార్తికేయన్ ట్వీట్..
My dear brothers and sisters,
I am taking a break from twitter for a while.
Take care, and i will be back soon 👍😊P.S: All updates on the films will be shared here by my team. pic.twitter.com/Nf4fdqXRTy
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) April 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

