Maaveeran | మావీరన్ నుంచి శివకార్తికేయన్ లుక్ అవుట్
Maaveeran | టాలెంటెడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తోన్న తాజా చిత్రం మావీరన్ (Maaveeran). ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Maaveeran | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం మావీరన్ (Maaveeran). మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులో మహావీరుడు టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మేకర్స్ ఇవాళ తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ నుంచి శివ కార్తికేయన్ లుక్ ఒకటి విడుదల చేశారు.నుదుటన విభూతి పెట్టుకొని దండం పెడుతున్న లుక్ విడుదల చేయగా.. నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు. గతేడాది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ప్రిన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శివకార్తికేయన్. జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళంలో మంచి హిట్‌గా నిలువగా.. తెలుగులో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
శివకార్తికేయన్ మరోవైపు ఆర్ రవికుమార్ దర్శకత్వంలో అయలాన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ కామెడీ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈషా కొప్పీకర్, భానుప్రియ, యోగిబాబు, శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ఎస్కే 24 సినిమా కూడా చేస్తున్నాడు శివకార్తికేయన్.
அனைவருக்கும் இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துக்கள்😊 pic.twitter.com/2V5999n9XL
— Shanthi Talkies (@ShanthiTalkies) April 14, 2023
Read Also :
Ponniyin Selvan-2 | మణిరత్నం పొన్నియన్ సెల్వన్-2 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్
Prabhas | రాజా డీలక్స్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్-రిద్దికుమార్ స్టిల్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

