Siva karthikeyan Telugu tweet | ఇప్పుడు తమిళ హీరోలు టాలీవుడ్‌పై కన్నేశారు. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో వచ్చిన కోలీవుడ్ స్టార్స్.. ఇప్పుడు డైరెక్ట్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి తెలుగు సినిమాల్లో పాగా వేశాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. తళపతి విజయ్ కూడా డైరెక్ట్ తెలుగులో ఒక సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పుడు వీరి బాటలోనే శివ కార్తికేయన్ తెలుగులో ఒక సినిమా చేయబోతున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సినిమాకు ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ తమిళ హీరో.
రెమో సినిమాతో తెలుగుతో శివ కార్తికేయన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించిన రెమో సినిమా ఇక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఈయన నటించిన ఒకటి రెండు సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఈ సారి డైరెక్ట్ సినిమా చేసి తనకంటూ మార్కెట్‌ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు ఈ తమిళ హీరో. ఈ క్రమంలోనే కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాను ఒప్పుకున్నాడు. ఇలాంటి సమయంలోనే తమిళంలో ఈయన నటించిన డాక్టర్ సినిమా అక్టోబర్ 9న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలైంది. నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమాను శివ కార్తికేయన్ సొంతంగా నిర్మించాడు. ఈ సినిమాలో తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో అక్కడ కలెక్షన్లు బాగానే వచ్చాయి. సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది.
శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ సినిమా తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదలైంది. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కొండపొలం సినిమా కూడా అదే రోజు రిలీజ్ అయింది. కానీ కొండపొలం సినిమా మొదటి షో నుంచి ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఇది వరుణ్ డాక్టర్ సినిమాకు కలిసొచ్చింది. పైగా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తెలుగులోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. చాలా రోజులకు తన సినిమా తెలుగులో హిట్ టాక్ తెచ్చుకోవడం.. అది కూడా డైరెక్ట్‌గా తెలుగులో డైరెక్ట్‌గా లాంఛ్ అవుతున్న సమయంలో ఈ హిట్ దక్కడంతో శివకార్తికేయన్ సంతోషంలో మునిగితేలుతున్నాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఒక ట్వీట్ చేశాడు. అది కూడా తెలుగులోనే ట్వీట్ చేయడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Prabhas fans | అప్సెట్లో ప్రభాస్ అభిమానులు..కారణమిదే !
మొన్న ప్రభాస్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. కొడుకు కోసం పూరీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా?
Love story | మహేశ్ బాబుకు సాయి పల్లవి సర్ప్రైజ్ !
ఉప్పెన 2 సినిమాపై దర్శకుడు బుచ్చి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు