Sita Ramam | యాభై రోజులు పూర్తి చేసుకున్న ‘సీతారామం’.. ఆకట్టుకుంటున్న డిలీట్ వీడియో
Sita Ramam Deleted Scene | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘సీతారామం’ ఒకటి. ఇండియన్ క్లాసికల్ లవ్‌స్టోరీ మూవీస్ లిస్ట్‌లో ఈ చిత్రం టాప్ ప్లేస్‌లో ఉంటుంది. దుల్కర్ సల్మాన్, మృనాళ్ థాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించింది.
Sita Ramam Deleted Scene | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘సీతారామం’ ఒకటి. ఇండియన్ క్లాసికల్ లవ్‌స్టోరీ మూవీస్ లిస్ట్‌లో ఈ చిత్రం టాప్ ప్లేస్‌లో ఉంటుంది. దుల్కర్ సల్మాన్, మృనాళ్ థాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ లభించింది. కమర్షియల్గానూ ఈ చిత్రం మంచి వసూళ్ళను సాధించింది. ఇక ఇటీవలే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయగా.. అక్కడ కూడా విపరీతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ ఈ చిత్రంతో ఇక్కడ మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు.
ఇక ఓటీటీలోనూ ఈ చిత్రం మంచి వ్యూవర్షిప్ను సాధించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తాజాగా 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మేకర్స్ ఎడిటింగ్‌లో తీసేసిన ఓ సీన్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో చాలా కాలంగా పాకిస్థాన్ ఆర్మీ బందిఖానాలో దుల్కర్, సుమంత్ ఉంటుండగా.. పాకిస్థాని ఆర్మీ జనరల్ సచిన్ ఖెడెకర్ రామ్ వద్దకు వచ్చి ‘నేను చేయగలిగేది ఏమైనా ఉంటే చెప్పు’ అని అంటాడు. ఆ తర్వాత దుల్కర్, సుమంత్‌ను కాసేపు బయటకు వస్తారు. ఇక అక్కడే ఫుట్‌బాల్ అడుతున్న వారిని చూసీ.. వీరిద్దరూ ఆ ఫుట్‌బాల్‌తో ఓ గేమ్ ఆడుతారు. అందులో సుమంత్ గెలుస్తాడు. దాంతో దుల్కర్ ‘విష్ణు సార్ మళ్ళీ కూడా మీరే గెలిచారు’ అంటాడు. దాంతో బాధతో, కోపంతో సుమంత్, దుల్కర్ కాలర్‌ను పట్టుకుని ‘నేను గెలవడం ఏంట్రా.. అంతా నీవళ్లే.. మనమినిక్కడ ఎన్ని రోజులు ఉన్నామో కూడా తెలియదు. పుట్టింది అమ్మాయో, అబ్బాయో కూడా తెలియదు అన్యాయం రా.. నేను నీ లాగా అనాధను కాదు, నాకోసం కుటుంబ ఎదురు చూస్తుంది’ అని అంటుంటాడు.
ఇంత మంచి సీన్ మూవీలో ఉండి ఉంటే బాగుండేది అని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పీరియాడికల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్‌కు జోడీగా మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా ముఖ్య పాత్రలో నటించింది. సుమంత్, తరుణ్‌భాస్కర్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై అశ్వినీదత్, స్వప్న దత్ నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

