Sita Ramam Movie | ఉత్తమ చిత్రంగా సీతారామం.. క్లాసికల్ లవ్‌స్టోరీకి ప్రతిష్టాత్మక అవార్డు..!
Sita Ramam Movie | గతేడాది హైయెస్ట్ ప్రాఫిటెబుల్ మూవీస్‌లో సీతారామం ఒకటి. అసలెలాంటి అంచనాల్లేకుండా రిలీజైన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ పట్టం కట్టారు. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా వచ్చిందంటూ థియేటర్లకు పరుగులు తీశారు.
Sita Ramam Movie | గతేడాది హైయెస్ట్ ప్రాఫిటెబుల్ మూవీస్‌లో సీతారామం ఒకటి. అసలెలాంటి అంచనాల్లేకుండా రిలీజైన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ పట్టం కట్టారు. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా వచ్చిందంటూ థియేటర్లకు పరుగులు తీశారు. ఇప్పటికే సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహేబ్ ఫాల్కే అవార్డును గెలుచుకుంది. దానితో పాటు ఇటీవలే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) అవార్డును కూడా సీతారామం సినిమా సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఈ సినిమా మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది.
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్ – 2023 (SIIMA) వేడుకల్లో ఉత్తమ చిత్రంగా సీతారామం నిలిచింది. దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. మొదటిరోజు తెలుగు, కన్నడ స్టార్స్ హాజరయ్యారు. ఇక ఇదే అవార్డ్ ఫంక్షన్లో ఉత్తమ పరిచయ నటిగా మృనాళ్ ఠాకూర్ అవార్డును అందుకుంది. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్ మూవీ) అవార్డు అందుకున్నాడు.
ఇక సీతారామం రిలీజయ్యే నాటికి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాల్లేవు. పైగా దర్శకుడు హను రాఘవపూడికి గతంలో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేదు. ఇక దుల్కర్‌కు క్రేజ్ ఉంది కానీ, మరీ హీరోగా సినిమాను తన భుజాలపై నడిపించే అంత పాపులారిటీ లైదు. దానికి మించి ఇక్కడ దుల్కర్‌కు చెప్పుకోదగ్గ మార్కెట్ కూడా లేదు. ఇక మృనాళ్ ఠాకూర్‌ను చూడటమే మొదటి సారి. కాస్తో కూస్తో ఈ సినిమాపై బజ్ వచ్చిందంటే దానికి రష్మిక మందనే కారణం. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్లకు కూడా పెద్దగా హైప్ ఏమీ తీసుకురాలేదు.
కట్ చేస్తే తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు. దుల్కర్, మృనాళ్ నటనకు తెలుగు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. డైరెక్టర్ హను టేకింగ్, విజన్‌కు ఫిదా అయిపోయారు. చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌తో థియేటర్లు కిక్కిరిపోయాయి. విమర్శకులు ప్రశంసలు పొందిన ఈ సినిమా కలెక్షన్లలోనూ రికార్డులు సృష్టించింది. దాదాపు రూ.35 కోట్ల బ్రేక్ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్లో ఏకంగా రూ.90 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

